పులకించిన పురుషోత్తపురంలో వేడుకగా గణనాథుని నిమజ్జన ఘట్టం

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో యువత అత్యంత ఉత్సాహంగా విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా యువతీయువకులు డీజే పాటలకు కేరింతలు కొడుతూ కోలాహలంగా నృత్యాలను ప్రదర్శించారు. భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన ఈ ఊరేగింపు మరియు నిమజ్జన ఘట్టం గ్రామస్థుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య కనులపండువగా ముగిసింది.