దివంగత భర్త సంజయ్ గుప్తాను తలచుకుని అనురాధ లేఖి గుప్తా భావోద్వేగం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

దివంగత చలనచిత్ర నిర్మాత సంజయ్ గుప్తా భార్య అనురాధ లేఖి గుప్తా తన భర్త మరణానికి ముందు సోషల్ మీడియాలో పంచుకున్న చివరి పోస్టులు ప్రస్తుతం తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. సంజయ్ గుప్తా మరణానికి కొన్ని గంటల ముందే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న కొటేషన్లు, జీవితంపై పెట్టిన రీల్స్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయని, వారిద్దరి అరుదైన ప్రేమ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోందని సన్నిహితులు తెలిపారు.