ఇరాన్ అణు కేంద్రంపై భారీ పేలుళ్లు: అమెరికా కీలక ప్రకటన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Tehran

ఇరాన్ లోని అత్యంత కీలకమైన ఇస్ఫహాన్ అణు కేంద్రం ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మునుపటి దాడుల్ లో మిగిలిపోయిన పేలని సామగ్రిని భద్రతా బలగాలు నియంత్రిత పద్ధతిలో పేల్చివేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ఇరవై మిలియన్ డాలర్ల భారీ రివార్డును అందజేస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.