ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు, తొమ్మిది మంది మృతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో డ్రోన్లు మరియు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో కనీసం తొమ్మిది మంది మృతి చెందగా, డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారు. ఉక్రెయిన్ అంతటా పౌర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మరోవైపు రష్యాలోని పారిశ్రామిక కేంద్రాలపై ఉక్రెయిన్ కూడా ప్రతిదాడులు నిర్వహించింది.