'ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేలు ఇస్తాం': కావలి రవాణా అధికారులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కావలి

సహాయం అందించే వారికి కేంద్ర ప్రభుత్వ 'రహ-వీర్‌' పథకం ద్వారా రూ.25వేల ఆర్థిక సహాయం లభిస్తుందని కావలి రవాణా అధికారి మురళిధర్, ఎంవీఐ ఆర్.సుందరరావు తెలిపారు. కావలిలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఏటా పదిమంది రహ-వీర్లను ఎంపిక చేసి రూ.లక్ష బహుమతి అందజేస్తారన్నారు. పోలీసులు లేదా వైద్యుల నుంచి గుర్తింపుపత్రం పొంది ఈ పథకానికి అర్హత సాధించవచ్చని, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీల ద్వారా ప్రోత్సహక మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.