కరాచీలో గణేశుడి విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్న ముస్లిం కళాకారుడు

రిపోర్టర్: సురేష్ స్థలం: World

పాకిస్థాన్‌లోని కరాచీలో గణేశ చతుర్థి వేడుకల కోసం ఒక ముస్లిం కళాకారుడు విగ్రహానికి రంగులు వేస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. గణేష్ మఠ్ మందిరంలో ఈ దృశ్యం కనిపించింది. 'ఎవరు హిందువు, ఎవరు ముస్లిం? కళకు మతం లేదు' అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మతాలకు అతీతంగా కళాకారుడు చూపుతున్న ఈ భక్తి, మానవత్వం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.