ఆదిలాబాద్‌లో డయల్ వంద పోలీసుల స్పందన: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి రక్షణ
రిపోర్టర్: రాము
స్థలం: ఆదిలాబాద్
కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆదిలాబాద్ డయల్-100 పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. కేఆర్కే కాలనీకి చెందిన నూటయాభై ఒక్క ఏళ్ల వ్యక్తి బ్రహ్మంగారి మందిరం వద్ద చెట్టుపైకి ఎక్కి ఉరేసుకుంటుండగా స్థానికులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ భుజంగరావు, హోంగార్డు రమేష్ కేవలం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని చెట్టుపైకి ఎక్కి తాడు కోసి కిందకు దించారు. అనంతరం అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.