శ్రీకాకుళంలో టైటానియం పార్క్ ఏర్పాటుకు రూ.16 వేల కోట్ల భారీ పెట్టుబడి

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీకాకుళం

రాష్ట్రంలో బీచ్శాండ్ ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా గారలో భారీ టైటానియం పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అదానీ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థతో కలిసి రూ.16,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.