టాటా సన్స్‌కు ఆర్బీఐ గట్టి షాక్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రైవేట్ కంపెనీగా కొనసాగేందుకు టాటా సన్స్ చేసిన అభ్యర్థనను ఆర్‌బీఐ తిరస్కరించింది. ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ దిశగా అడుగులు వేయడం అనివార్యమైంది. ఈ పరిణామంతో టాటా సన్స్ ఐపీఓ రాకపై మార్కెట్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.