ఏఐ టెక్నాలజీ నన్ను తీవ్రంగా భయపెడుతోంది: ప్రముఖ నటి కృతి సనన్ ఆందోళన

రిపోర్టర్: రమేష్ స్థలం: ముంబై

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరగడంపై ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దాన్ని నియంత్రించే చట్టాలు ఆ స్థాయిలో లేవని ఆమె అన్నారు. అసలు ఫోటో ఏదో ఏఐ సృష్టించిన ఫోటో ఏదో గుర్తించడం చాలా కష్టంగా మారిందని సోషల్ మీడియాలో తప్పుడు చిత్రాలను తొలగించడం సవాలుగా మారిందని పేర్కొంటూ కృతి సనన్ హెచ్చరించారు.