'ఆపద సమయంలో పోలీసు శాఖ అండగా ఉంటుంది': కాకినాడ ఎస్పీ భరోసా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో ఇటీవల మృతి చెందిన ముగ్గురు హోమ్ గార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ 'చేయూత' కార్యక్రమం కింద ఆర్థిక సహాయం అందజేశారు. హోమ్ గార్డుల ఒక రోజు డ్యూటీ అలవెన్సును ఈ సహాయం నిమిత్తం సమకూర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అన్ని విధాల భరోసా కల్పిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.