గాంధీ జయంతి వేళ ఆమనగల్లులో మాంస విక్రయాలపై నిషేధం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
గాంధీ జయంతి సందర్భంగా ఆమనగల్లు పురపాలక సంఘ పరిధిలో అక్టోబర్ 2వ తేదీన జీవహింస నిషేధించబడింది. పట్టణంలోని మాంసము మరియు చికెన్ విక్రయదారులు ఎవరూ కూడా ఆ రోజు దుకాణాలు తెరిచి మాంసం విక్రయాలు చేయరాదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని మున్సిపల్ యంత్రాంగం హెచ్చరించింది.