విద్యార్థులకు అలర్ట్: నేడు విడుదల కానున్న ఐఎన్ఐ సీఈటీ అడ్మిట్ కార్డు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ జనవరి సెషన్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను నేడు విడుదల చేయనున్నట్లు పరీక్షల నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు. జనవరి సెషన్ పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీన కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష జరగనుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు పేర్కొన్నారు.