రామప్ప దేవాలయ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని మంత్రి సీతక్క పిలుపు

రిపోర్టర్: రాము స్థలం: ములుగు

రామప్ప దేవాలయం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం ఆవరణలో వరల్డ్ టూరిజం డే వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. కాకతీయుల శిల్పకళా వైభవం, అపారమైన ప్రకృతి సంపద మన జిల్లా సొంతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు.