లద్దాఖ్‌ బాలుడి అమరావతి వీడియోను షేర్ చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

లద్దాఖ్‌కు చెందిన బాలుడు అమరావతి పేరు ఉచ్చరించిన వైరల్ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 'ఎక్స్‌' వేదికగా ఆ వీడియోను పంచుకుంటూ జై అమరావతి, జైజై అమరావతి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కీర్తి నలుదిశలా వ్యాపించిందని ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.