అమెరికాలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమాన సర్వీసులు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో న్యూయార్క్, లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కమ్యూనికేషన్ కేబుల్ తెగిపోవడం వల్ల పైలట్లకు, కంట్రోల్ టవర్ సిబ్బందికి మధ్య సంబంధాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గ్రౌండ్ స్టాప్ విధించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంజనీర్లు కేబుల్ మరమ్మతులు పూర్తి చేసి వ్యవస్థను పునరుద్ధరించడంతో సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.