టెక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి సరికొత్త వివో బడ్స్ క్లిప్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
సరికొత్త ఓపెన్ ఇయర్ డిజైన్ తో అత్యాధునిక ఫీచర్లతో వివో బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ఇయర్ బడ్ బరువు కేవలం ఐదు గ్రాములు మాత్రమే ఉంటుందని, సంగీతం వింటూనే చుట్టుపక్కల శబ్దాలను స్పష్టంగా వినేలా వీటిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ డివైజ్ సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ తో పాటు ఏఐ ఆధారిత నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని కలిగి ఉందని స్పష్టం చేశారు.