బెంగళూరులో మహిళలపై దాడి చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: Bengaluru
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆటో బుక్ చేసి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో ఇద్దరు యువతులపై దాడి చేసిన ముప్పై ఏళ్ల ఆటో డ్రైవర్ చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారులు మంగళవారం తెలిపారు. యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకుని రద్దు చేయడంతో అక్కడికి చేరుకున్న డ్రైవర్ యువతులను దూషించడమే కాకుండా వారిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి బాధితురాలితో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.