దళితుల నిరసన రోడ్లను శుద్ధి చేయడం దారుణం.. బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని రాజనర్సు డిమాండ్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు పాల్గొని మాట్లాడారు. దళితులు నిరసన తెలిపిన రోడ్లను పసుపునీళ్లు, పాలతో శుద్ధి చేసిన వ్యక్తులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ ఘటన తీవ్ర కుల వివక్షకు నిదర్శనమని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు తదితరులు హాజరయ్యారు.