మహమ్మద్ రిజ్వాన్ పిటిషన్‌ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: పాకిస్థాన్

పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌ల భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీసులను సవాల్ చేస్తూ రిజ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పీసీబీ సిద్ధమవుతోంది.