శంషాబాద్ విమానాశ్రయంలో భారీ బంగారం పట్టివేత: రూ. 1.20 కోట్లు సీజ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రంగారెడ్డి

హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారని అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఓ నగల వ్యాపారి నుంచి సుమారు 800 గ్రాముల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 1.20 కోట్లు ఉంటుందని అంచనా వేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.