మమితా బైజు పేరు వెనుక ఆసక్తికరమైన నిజం బట్టబయలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజం గురించి ప్రముఖ నటి మమితా బైజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు తన పేరును నమితగా నిర్ణయించగా, జనన ధ్రువీకరణ పత్రం నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఆ పేరు మమితగా మారిపోయిందని ఆమె తెలిపారు. పాఠశాలలో చేర్పించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, అప్పటికే అధికారిక పత్రాల్ లో పేరు నమోదు కావడంతో అలాగే కొనసాగించాల్సి వచ్చిందని నటి పేర్కొన్నారు.