వాతావరణ మార్పుల ముప్పులపై డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలక హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh / Telangana

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దైనందిన జీవితాలపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటోందని, ఆరోగ్య ముప్పులను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని మాజీ డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు పరిశోధనల్లో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడం ఒక సమర్థవంతమైన మార్గమని ఆమె పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల పాత్రను గుర్తుచేశారు.