అనంతపురంలో కలకలం: పాఠశాలలో బాలికలపై దాడి చేసిన నిందితుడు ఎన్కౌంటర్

రిపోర్టర్: హరి స్థలం: Anantapur

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై చెయిన్సా తో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ ఆత్మకూరు అడవి ప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్ లో తీవ్రంగా గాయపడ్డాడని ఎస్పీ పి. జగదీష్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా నిందితుడు కత్తితో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అతడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.