తిరుపతి జిల్లాలో పల్లెపండుగ రోడ్డు ధ్వంసం: పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: Tirupati
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన నూతన రహదారిని ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వైకాపా నేత సుబ్బారెడ్డిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేయాలని స్పష్టం చేశారు.