తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తోంది. విశాఖపట్నానికి తూర్పున కేంద్రీకృతమైన ఈ వాయుగుండం సెప్టెంబర్ 23 అర్ధరాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య ఉత్తర కోస్తా - ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.