బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కృష్ణా
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వమని, రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చట్టబద్ధంగా 34 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని కొల్లు రవీంద్ర - గనుల & ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సామాజిక సాధికారత దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు.