ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు: పది గైడెడ్ బాంబులతో విరుచుకుపడటంతో ఇరవై ఆరుగురు మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: Zaporizhzhia
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని జపోరిజియా రీజియన్ లో మానవతా సాయం అందించే కేంద్రాలపై రష్యా బలగాలు జరిపిన భీకర దాడుల్ లో ఇరవై ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏజెన్సీ వెల్లడించింది. పాఠశాల భవనం, షెల్టర్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా పది గైడెడ్ బాంబులతో విరుచుకుపడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశం రష్యాకు లేదని ఆయన ఆరోపించారు.