ముంబై విమానాశ్రయంలో నకిలీ పాస్పోర్టుల గుట్టురట్టు: ముగ్గురు విదేశీయుల అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Mumbai

నకిలీ పత్రాలతో అక్రమంగా భారతీయ పాస్పోర్టులు పొందిన ముగ్గురు విదేశీయులను ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని సాహర్ పోలీసులు తెలిపారు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన నిందితులు మోసపూరిత సమాచారంతో పాస్పోర్టులు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.