డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు కేటాయించినప్పటికీ వాటిలో నివాసం ఉండని లబ్ధిదారులకు చివరి అవకాశం కల్పించింది. ఇప్పటికే రెండు విడతలుగా నోటీసులు ఇచ్చినా స్పందించని లబ్ధిదారులు వారం రోజుల్లోగా ఇళ్లలోకి వచ్చి నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులను శాశ్వతంగా రద్దు చేసి అర్హులైన ఇతర పేదలకు కేటాయించనున్నట్లు గృహనిర్మాణ శాఖ స్పష్టం చేసింది.