జన్మదిన వేడుకలతో పులకించిన ఎమ్మిగనూరు కోట్ల అభిమానుల కోలాహలం
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద కోట్ల అభిమానులు, టీడీపీ నాయకులు భారీగా పాల్గొని బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు నియోజకవర్గంతో కోట్ల కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఎల్ఎల్సీ ఆధునీకరణ, నాగలదిన్నె తుంగభద్ర నదిపై వంతెన వంటి అభివృద్ధి పనుల్లో కోట్ల కుటుంబం కీలక పాత్ర పోషించిందని అన్నారు.