కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత, భారీగా అరెస్టులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల ఆందోళనలతో పోలీసులు నలుదిశలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు భారాస, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు.