క్రీడలతో పాటు విద్యార్థులు చదువుకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న నాతరి స్వామి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి మండలం సోమగూడెం త్రినేత్రి ఫంక్షన్హాల్లో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలను సింగరేణి జీఎం రాధాకృష్ణ, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆరు వందలకు పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరాటే ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అతిథులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వారు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.