హైదరాబాద్ లో దారుణం: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని కొత్తపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో భర్త కోటం ప్రభాకర్‌ను ఆయన భార్య రజిత కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం దంపతుల మధ్య వివాదం తీవ్రతరం కావడంతో రజిత కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు విజయభాస్కర్ ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు.