విశాఖ మేయర్ బరిలో పదిహేను మంది: రసవత్తరంగా జీవీఎంసీ ఎన్నికల పోరు

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల బరిలో పదిహేను మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో కూటమి మరియు వైసీపీ మధ్య ప్రధాన పోరు రసవత్తరంగా మారింది. రెండు పార్టీలు కూడా బీసీ మహిళా అభ్యర్థులను బరిలోకి దించడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయని, ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.