నెల్లూరు అభివృద్ధికి నిధులు: రూ.237 కోట్ల హెచ్ఏఎం నిధుల మంజూరు

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగర అభివృద్ధి కోసం రూ.237 కోట్ల హెచ్ఏఎం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పొంగూరు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. సర్వేపల్లి కాల్వకట్టపై రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. సుబేదారుపేటలో పాఠశాల భవన నిర్మాణం, బాజీతోట పాఠశాలకు అదనపు భవనాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో 23 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.