అద్భుత రహస్యం: నూట ఏడేళ్ల వయసులోనూ ఫిష్ అండ్ చిప్సే నా ఆరోగ్యం

రిపోర్టర్: సునీల్ స్థలం: Wales

వేల్స్ దేశంలోనే అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన నూట ఏడేళ్ల ఓవెన్ ఫైలర్ తన దీర్ఘాయువు రహస్యాన్ని వెల్లడించారు. తాను ఎప్పుడూ అతిగా తినలేదని, రోజూ ఫిష్ అండ్ చిప్స్ తినడమే తన ఆరోగ్య రహస్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కష్టపడి పని చేయడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే తనను ఇంతకాలం ఆరోగ్యంగా ఉంచాయని ఆయన వివరించారు.