అంతర్జాతీయ దిగ్గజ గాయని డియోన్ వార్విక్ ఆర్థిక దివాలా ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: New Jersey

అమెరికా ప్రసిద్ధ గాయని డియోన్ వార్విక్ ఆర్థిక ఇబ్బందులతో దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె ప్రతినిధి కెవిన్ ససాకి తెలిపారు. కోట్లలో పన్ను బకాయిలు పెరిగిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఎనభైల నాటి ఆర్థిక నిర్వహణా లోపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతోందని స్పష్టం చేశారు.