రాప్తాడు హైస్కూల్ దాడి ఘటన: హెడ్మాస్టర్ సహా ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Anantapur

అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్ ఆవరణలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనలో విధుల్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్మాస్టర్ రాజేశ్వరి, ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరిలను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్ లో విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు యంత్రాంగం స్పష్టం చేసింది.