క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పటాన్‌చెరు పరిధిలో సంచలనం సృష్టించిన క్యాబ్ డ్రైవర్ హత్య మరియు దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలతో పాటు దర్యాప్తు పురోగతిని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.