ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ప్రశంసించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
ప్రయాణీకుల భద్రత కోసం అంకితభావంతో వ్యవహరించిన ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, పోరాటపటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ఆయన చూపిన తెగువను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని ప్రశంసించారు. ప్రమాదకర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన తీరు అభినందనీయమని సీఎం తెలిపారు.