కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ భారీ మహాధర్నాకు పిలుపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి పెరిగింది. అసెంబ్లీకి రాకుండా బాధ్యత విస్మరిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 6న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ భారీ మహాధర్నాకు సిద్ధమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సభకు హాజరయ్యేలా ఒత్తిడి పెంచడమే ఈ ధర్నా ప్రధాన లక్ష్యం.