మురసు తుఫాను ముప్పు: అప్రమత్తమైన యంత్రాంగం, పాఠశాలలకు సెలవులు జారీ

రిపోర్టర్: హరి స్థలం: మచిలీపట్నం

అర్నబ్ తుఫాను విధ్వంసం మరచిపోకముందే మురసు రూపంలో మరో తుఫాను ముంచుకొస్తోందని, ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు ఈనెల రెండవ తేదీన పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పంట నష్టంతో దిగులు చెందుతున్న రైతన్నలు తాజా హెచ్చరికలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.