వరద ఉధృతిలో వాగులు దాటుతున్న అల్లూరి జిల్లా గిరిజనులు

రిపోర్టర్: రమేష్ స్థలం: Alluri Sitharama Raju

అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం కొందరు ప్రజలు ఉప్పొంగుతున్న వాగులను తాత్కాలిక తెప్పల సహాయంతో దాటేందుకు సాహసిస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, జి. మాడుగుల మండలాల్లో వంతెనలపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.