గుంటూరులో కిడ్నాప్ కలకలం: తల్లి పక్కనే నిద్రిస్తున్న పసికందు అపహరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ముగ్గురు యువకులు బైక్పై వచ్చి అపహరించుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పాత సామాను దుకాణం ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.