అమెరికాలో రూ. 90 కోట్ల లగ్జరీ ఇల్లు కొన్న మెస్సీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ అమెరికాలో భారీ నివాసాన్ని కొనుగోలు చేశారు. ఇంటర్ మయామి క్లబ్‌లో చేరిన తర్వాత ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ ప్రాంతంలో రూ. 10.75 మిలియన్ల (సుమారు రూ. 90 కోట్లు) విలువైన వాటర్‌ఫ్రంట్ ఎస్టేట్‌ను తన కుటుంబం కోసం సమకూర్చుకున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.