విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు: ఎస్ఈసీ కీలక నిర్ణయం

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ను 29వ తేదీకి మార్చామని తెలిపారు. కౌంటింగ్ మాత్రం యథాతథంగా 30వ తేదీనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.