అమెరికాలో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై పబ్లిక్ చార్జ్ నిబంధన అమలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: వాషింగ్టన్

అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు వైద్య సహాయం, ఫుడ్‌ స్టాంప్‌లు, ట్యూషన్‌ సహాయం వంటి ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకుంటే వారి గ్రీన్ కార్డ్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అంచనాల ప్రకారం అమల్లోకి వచ్చిన ఈ విస్తరించిన పబ్లిక్ చార్జ్ నిబంధనను వ్యతిరేకిస్తూ న్యూయార్క్‌తోపాటు మరో 21 రాష్ర్టాలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.