కొత్త బస్సుల కొనుగోలులో ఏపీఎస్ఆర్టీసీ తీవ్ర జాప్యంపై ప్రయాణికుల ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
మహిళలకు ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని, అయితే పాత బస్సులను స్క్రాప్ చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల వర్గాలు తెలిపాయి. విద్యుత్ బస్సుల కోసం మౌలిక వసతుల కల్పన నత్తనడకన సాగుతోందని పేర్కొన్నారు. సీఎన్జీ నాన్-ఏసీ బస్సుల టెండర్లను రద్దు చేసి ఏసీ బస్సుల కోసం తాజాగా టెండర్లు పిలవడంతో బస్సుల రాక మరింత ఆలస్యం కానుందని వెల్లడించారు. పీక్ అవర్స్‌లో బస్సులు సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.