అవగాహన కార్యక్రమం
తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు శక్తి పోలీస్ టీమ్ సిబ్బంది బిరవపట్టడ ఆర్చ్ సమీపంలోని A.P. T.W.R. బాలికల పాఠశాల మరియు హాస్టల్ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, ఈవ్‌టీజింగ్, మహిళలు మరియు బాలికల భద్రత, సెల్ఫోన్లు మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలు, తెలియని లింకులు, అనుమానాస్పద వీడియో కాల్స్, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం వల్ల కలిగే సమస్యలు, టీనేజ్ ఆకర్షణలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే చైల్డ్ అబ్యూస్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ పోర్నోగ్రఫీ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, మొబైల్ గేమ్స్ దుష్ప్రభావాలు, మంచి స్నేహం, మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, చదువు ప్రాధాన్యత, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించడం** వంటి అంశాలపై విద్యార్థినులకు సూచనలు అందించారు. సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు మరియు ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన కల్పించారు.